అవును మా ఉద్యమం ముగిసింది : ఏపీ జేఏసీ

Bopparaju Venkateshwarlu says employees agitation has ended. ఉద్యోగుల ఆందోళనలు, ఉద్యమాన్ని ముగించామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.

By M.S.R  Published on  9 Jun 2023 11:21 AM
అవును మా ఉద్యమం ముగిసింది : ఏపీ జేఏసీ

ఉద్యోగుల ఆందోళనలు, ఉద్యమాన్ని ముగించామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇచ్చిన 47 డిమాండ్లలో 37 డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. ఓపీఎస్ విధానం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని అన్నారు. జీపీఎస్ అమలుకు ముందు మరోసారి సమీక్ష చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కూడా సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకువస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇప్పుడు ఓపీఎస్ తో సమానంగా ప్రయోజనం కలిగించేలా జీపీఎస్ ను తీసుకువచ్చారని వివరించారు. ఉద్యోగులు రిటైర్ అయ్యాక భద్రత కల్పించేలా జీపీఎస్ తెచ్చారని.. జీపీఎస్ తీసుకువచ్చినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపామని వెంకట్రామిరెడ్డి అన్నారు.


Next Story