ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని ఓ షాపింగ్ మాల్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. పాతపట్నం మండల కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగాయి. పాతపట్నం పోలీస్ సిబ్బంది, స్థానికుల సహాయంతో అటు ఒడిస్సా ఇటు టెక్కలి అగ్నిమాపక కేంద్రాల నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. షాపింగ్ మాల్‌లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.
రెండు అంతస్తుల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని మాల్ యజమానులు తెలిపారు. జిల్లాలోని ఒడిశా-ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో ఈ మాల్ ఉంది. అగ్ని ప్రమాదానికి కారణంగా షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలోని ఓ షాపింగ్ మాల్‌లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది.