క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటే బిర్యానీ ఫ్రీ.. ఏపీలో ఎక్క‌డంటే..?

Biryani free for covid vaccinated people.క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2021 7:34 PM IST
క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటే బిర్యానీ ఫ్రీ.. ఏపీలో ఎక్క‌డంటే..?

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. రానున్న మూడు వారాలు మ‌రింత కీల‌కం కానుండ‌డంతో.. రాష్ట్రాల సీఎంల‌తో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్ర‌ధాని మోదీ టీకా ఉత్స‌వ్ నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు. ఈ టీకా ఉత్స‌వ్‌ని ఏప్రిల్ 11 నుంచి 14 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. వీలైనంత ఎక్కువ మంది అర్హులకు కరోనా వ్యాక్సిన్ అంద‌జేయ‌నున్నారు. ఇక ప్ర‌జ‌లు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్స‌హించేందుకు ప‌లు సంస్థ‌లు త‌మ వంతు కృషి చేస్తున్నాయి.

కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు ఇలా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీ పథకాలను తీసుకొస్తున్నాయి.. తమ సంస్థకు ప్రచారం చేసుకోవడంతో పాటు.. కాస్త సామాజిక సేవ కూడా చేస్తున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ సంస్థ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బిర్యానీ ఫ్రీ అంటూ కొత్త ఆఫర్ తెచ్చింది. టీకా ఉత్సవ్ జరిగే ఏప్రిల్ 11 నుంచి 14 వరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేవారికి బిర్యానీ ఫ్రీ అంటూ హలో కిచెన్ సంస్థ ప్రకటించింది. విజయనగరం, కాకినాడలలోని తమ బ్రాంచ్‌లలో కరోనా టీకా వేయించుకున్నవారికి బిర్యానీ ఉచితంగా అందజేయనున్నట్టు పేర్కొంది.

ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌ను కూడా విడుద‌ల చేశారు. అయితే.. కొన్ని ష‌ర‌తులు ఉన్నాయండి. వ్యాక్సిన్ తీసుకున్న రశీదు చూపించినవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని.. మొదటి వంద మంది మాత్రమే ఉచిత బిర్యానీ పొందేందుకు అర్హులు అని తెలిపింది. బిర్యానీ ఫ్రీ అంటూ పెద్ద అక్షరాలతో ప్రకటన చేసిన హలో కిచెన్ సంస్థ.. కింద మాత్రం కండిషన్స్ పెట్టి.. కావాల్సినంత ప‌బ్లిసిటీ పొందింది.


Next Story