ఏపీలోని వారికి భారీ గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేకుండా రూ.3 లక్షల రుణం

చేతివృత్తుల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనను రాష్ట్రంలోని 'ఆదరణ' స్కీమ్‌తో అనుసంధానించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

By అంజి
Published on : 23 Aug 2024 6:11 AM IST

artisans, APnews, loan, PM Vishwakarma Yojana, Adaraana Scheme

ఏపీలోని వారికి భారీ గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేకుండా రూ.3 లక్షల రుణం

చేతివృత్తుల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనను రాష్ట్రంలోని 'ఆదరణ' స్కీమ్‌తో అనుసంధానించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని సమాచారం. ఈ పథకంలో ఎంపికైన వారికి రెండు విడతల్లో రూ.3 లక్షల రుణం అందిస్తారు. బ్యాంకులు విధించే 13 శాతం వడ్డీలో కేంద్రం 8 శాతం భరిస్తుండగా, మిగిలిన 5 శాతం వడ్డీని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే లబ్ధిదారులు చెల్లించే ఐదుశాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో లబ్ధిదారులకు వడ్డీ లేకుండానే రుణం అందనుంది.

ఆ రుణంలోనూ కొంత రాయితీగా ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అయితే రాష్ట్రంలో ఎంతమంది ప్రస్తుతం చేతివృత్తుల మీద ఆధారపడి ఉన్నారనే దానిపై ప్రభుత్వం సర్వే చేయనుంది. సచివాలయ సిబ్బంది సహకారంతో ఈ సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్వే తర్వాత ఆదరణ- విశ్వకర్మ యోజనను అమలు చేసే అవకాశం ఉంది. 2023, సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు.

Next Story