ఏపీకి బిగ్ అలర్ట్.. రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు
తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి.
By అంజి Published on 30 Sept 2023 11:21 AM ISTఏపీకి బిగ్ అలర్ట్.. రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు
తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా రానున్న 48 గంటల్లో ఏపీకు భారీ వర్షసూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు అల్పపీడనం ఏర్పడటం వల్ల వాతావరణంలో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమౌతోంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో నైరుతి రుతు పవనాల ప్రభావం దాదాపుగా పోయిందని చెప్పాలి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండ్రోజుల వరకూ ఏపీలో భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. రానున్న 48 గంటలు ఏపీలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు.
అల్పపీడనానికి తోడు మరో ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండటంతో భారీ వర్షసూచన ఉంది. రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అక్టోబర్ 3 నుంచి ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో వర్షాల తీవ్రత పెరగవచ్చని ఐఎండీ సూచించింది. ఇవాళ అన్నమయ్య, నంద్యాల, కడప, కాకినాడ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక తిరుపతి, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.