టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వరి, బ్రాహ్మణి
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో కూడిన ఎన్‌డిఏ కూటమి అఖండ విజయం దిశగా పయనిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ గెలుపులో ఇద్దరు మహిళల ప్రత్యేక పాత్ర ఉంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Jun 2024 5:29 PM ISTఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో కూడిన ఎన్‌డిఏ కూటమి అఖండ విజయం దిశగా పయనిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ గెలుపులో ఇద్దరు మహిళల ప్రత్యేక పాత్ర ఉంది. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిల సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. మంచి సమయాలైనా, కష్ట సమయాలైనా సరే, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల వెనుక ఈ ఇద్దరు తమ మద్దతును ఇస్తూ అండగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చేసిన యాత్రలు.. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి తోడుగా నిలిచారు.
న్యూస్‌మీటర్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ మాట్లాడుతూ.. 2024 AP అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ కోసం ప్రచారం చేయడానికి తన జీవిత భాగస్వామి, తల్లి ఎలా ముందుకు కదిలారనే విషయం గురించి మాట్లాడారు.
లోకేష్‌కి అది ఎమోషనల్ విషయం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, ఇది మొత్తం కుటుంబానికి షాక్ ఇచ్చింది. “చంద్రబాబు నాయుడు ఎంతో విధేయుడైన వ్యక్తి. అది మొత్తం సమాజానికి తెలుసు. ఒక అవినీతిపరుడు అరెస్టయితే రోజుకో కొత్త కుంభకోణం బయటపడుతుంది. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, ఆయన చేసిన మంచి పని బయటకు వచ్చింది. దీన్ని బట్టి చూస్తే దాదాపు 100 దేశాల్లోని తెలుగు ప్రజలు వివిధ కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలిపారు." అని నారా లోకేష్ అన్నారు.
ఏకమైన కుటుంబం:
సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉండే చంద్రబాబు నాయుడు జీవిత భాగస్వామి.. 2015లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై గతేడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉంచిన సమయంలో ఆయన జీవిత భాగస్వామి తెరపైకి వచ్చారు. ఆ సమయంలో, ఆమె చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తలు విన్న తర్వాత 'మరణించిన' వ్యక్తుల కుటుంబాలను ఓదార్చడానికి 'నిజం గెలవాలి' యాత్ర చేస్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు.
రోడ్డు మార్గంలో 10,000 కి.మీ ప్రయాణించిన భువనేశ్వరి
నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి విని మరణించిన ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. ఆమె దాదాపు 9-10,000 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి, ప్రతి ఇంటికి వెళ్లి, కుటుంబానికి అండగా నిలిచి, వారికి పార్టీ తరపున చెక్కును అందజేసారు. “ప్రతి కార్యకర్త మాకు కుటుంబంతో సమానం. ఆ కోణంలో ఇది చాలా వ్యక్తిగతమైనది. నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అమ్మ ఎప్పుడూ బయటకు రాలేదు, బ్రాహ్మణి చాలా అరుదుగా ప్రచారం చేశారు’’ అని లోకేశ్ అన్నారు.
ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన నారా బ్రాహ్మణి
నారా బ్రాహ్మణి మంగళగిరిలో గత ఎన్నికల్లో అంతగా యాక్టివ్‌గా లేరు. రాజకీయ జీవితానికి దూరంగా ఉంటూ భర్త, మామలకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ ఎన్నిక సమయంలో కొన్ని నియోజక వర్గాల్లో ప్రత్యేకంగా ప్రచారాన్ని చేపట్టి, మహిళా రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలతో మమేకమై వారి సమస్యలను విన్నారు. ఎన్నో విషయాల్లో నారా లోకేష్ కు బ్రాహ్మణి బలమైన మూలస్తంభంగా నిలిచారు.