బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు ఉపక్రమించింది. 29 మంది టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. అయితే ఈ పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని ఆరోపించారు. వారిపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్నందునే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పాల్ ఆరోపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వారిపై విచారణలు ఉండవా? వాళ్ల మీద ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరగవా? అంటూ ప్రశ్నించారు.