టీడీపీ నేతలకు మాజీ మంత్రి బాలినేని సవాల్‌

Balineni Srinivasa Reddy. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  2 April 2023 2:49 PM GMT
టీడీపీ నేతలకు మాజీ మంత్రి బాలినేని సవాల్‌

Balineni Srinivasa Reddy


మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మేము తలుపులు తెరిస్తే తెలుగుదేశంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. బాలినేని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తుంటే.. ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. మేము తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరు. 40 మంది మా పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి టచ్‌లో ఉంటే.. ఇద్దరు ఎమ్మెల్యేలను ఎందుకు కొనుకున్నారు? అని ప్రశ్నించారు. ఒంగోలులో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంది టీడీపీనేని విమ‌ర్శించారు. పేదల స్థలాలపై టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని దేవుడి సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను. కోర్టుకు వెళ్లలేదని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని బాలినేని టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు.


Next Story