అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు బాలకృష్ణ భూమిపూజ
తుళ్లూరులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొత్త క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది
By Knakam Karthik
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు బాలకృష్ణ భూమిపూజ
అమరావతి: తుళ్లూరులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొత్త క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది. కాగా ఈ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులకు ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బసవతారం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఓ ప్రకటన విడుదల చేసింది. 25 సంవత్సరాలకు పైగా క్యాన్సర్ సంరక్షణలో విశ్వసనీయమైన పేరుగాంచిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, దాని ప్రయాణంలో సరి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం గర్వపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాపిటల్ రీజియన్ అమరావతిలోని తుళ్లూరులో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ అభివృద్ధి చేస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో అధిక-నాణ్యత క్యాన్సర్ చికిత్సను ఇతర ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా అవసరమైన చోట ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ నిబద్దతను మరో మారు తెలియజేస్తుంది...అని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని క్షేత్రంలో 21 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబడుతున్న ఈ సరికొత్త ఫెసిలిటీ ని సమగ్రమైన క్యాన్సర్ చికిత్స, పరిశోధనతో పాటూ రోగి యొక్క కేంద్రీకృత సంరక్షణ కోసం ఒక ఎక్స్ లెన్సి సెంటర్ గా తీర్చిదిద్దాలనేది సంస్థ ప్రణాళిక. అత్యాదునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని మల్లీ డిసిప్లినరీ విధానంతో అనుసంధానించి లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా ఏర్పాటు చేయబడుతోంది. ఈ సరికొత్త అత్యాధునిక ఫెసిలిటీని రెండు ఫేజ్‌లలో అభివృద్ది చేయాలని నిర్ణయించారు.