పవన్ కళ్యాణ్-చంద్రబాబు భేటీపై శాప్ ఛైర్మన్, వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం వచ్చిన బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మాట్లాడుతూ.. అసలు వారిద్దరూ విడిపోయి ఉంటే.. ఇప్పుడు కలుసుకున్నారు అని చెప్పొచ్చు.. అసలు వారు ఎప్పుడూ కలిసే వున్నారుగా అని చెప్పుకొచ్చారు. వారిద్దరూ విడివిడిగా వచ్చినా, కలిసొచ్చినా వైసీపీకి 175 సీట్లకు 175 రావడం ఖాయమన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళితే తెలుస్తుంది ఎవరెవరికి ఎన్ని పథకాలు, ఎన్ని నిధులు ఇచ్చామో అని అన్నారు. మా వద్ద అన్ని లెక్కలు ఉన్నాయి, ఇతర పార్టీ నేతల వద్ద ఉంటే రండి అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మావాడు అని ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని బైరెడ్డి అన్నారు.
అంతకు ముందు రాజమండ్రిలో మాట్లాడుతూ.. జగన్‌ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదన్నారు. జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందన్నారు. రాష్ట్రానికి జగన్ మంచి చేస్తున్నారని, రాష్ట్రంలో మార్పు తెస్తున్నారన్నారు. బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడి కొంత మంది పొత్తుల కోసం తిరుగుతున్నారని అన్నారు.