ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్
Bad news for Drunkers in AP.ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 30 Jan 2021 2:58 PM ISTఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9న తొలి దశ పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగే రోజుల్లో సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వచ్చేనెల 9, 11, 13, 21తేదీల్లో ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవును ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలను వాడుకోవాల్సి ఉన్నందున స్థానిక సెలవులను ప్రకటించారు.
అలాగే, పాఠశాలలు, దుకాణాలకు కూడా సెలవులు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల సామగ్రి పంపిణీకి వాహనాలను సిద్ధం చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరూ ఏ అభ్యర్థికీ ఎన్నికల ఏజెంట్ గా ఉండరాదని తెలిపింది. ఇక పోలింగ్ తేదీకి 44 గంటల ముందు నుంచి ఆయా పంచాయతీల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున్న ఖచ్చితంగా పాటించాలని.. పోలింగ్ బాక్సులతో పాటు సిబ్బందిని తరలించేందుకు ప్రభుత్వశాఖలకు చెందిన వాహనాలు వినియోగించుకోవాలని కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.