గ‌ర్భంలోని శిశువు మాయం.. మ‌హిళ ఆరోప‌ణ‌.. డాక్ట‌ర్లు షాక్.. !

Baby missing in the Womb in Tirupati Maternity Hospital.త‌ల్లి పొత్తిళ్ల‌లోంచి బిడ్డ‌ను మాయం చేసి.. సొమ్ములు చేసుకునే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jan 2021 4:40 PM IST
గ‌ర్భంలోని శిశువు మాయం.. మ‌హిళ ఆరోప‌ణ‌.. డాక్ట‌ర్లు షాక్.. !

త‌ల్లి పొత్తిళ్ల‌లోంచి బిడ్డ‌ను మాయం చేసి.. సొమ్ములు చేసుకునే ముఠాల ఉదంతాలు చాలానే చూశాం. అయితే.. త‌న గ‌ర్భంలోంచి శిశివును మాయం చేశారంటూ ఓ మహిళ ఆరోపిస్తూ గొడ‌వ‌కు దిగింది. డాక్ట‌ర్ల‌పై ఆ మ‌హిళ ఆరోప‌ణ‌లు చేయ‌డంతో తిరుప‌తి ప్ర‌భుత్వ ఆస్పత్రిలో క‌ల‌క‌లం రేగింది. కాగా.. ఆ మ‌హిళ‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు వైద్యులు.

వివ‌రాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన శశికళ అనే మహిళ తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి ఇటీవల వచ్చారు. పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి ఆస్ప‌త్రికి ఆ మ‌హిళ వ‌చ్చింది. కాన్పు కోసం వచ్చిన తనకు గర్భం రాలేదని అంటున్నారంటూ ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఆమె చేస్తున్న వింత వాద‌న‌తో ఆస్ప‌త్రి సిబ్బందితో పాటు రోగులు ఖంగుతిన్నారు.

గర్భంలోని శిశువును మాయం చేశారంటూ వైద్యులపై ఆగ్రహం వ్య‌క్తం చేసింది. అంతేకాక ఆస్ప‌త్రి ముందు నిర‌స‌నకు దిగింది. మహిళ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రసూతి ఆసుపత్రి వైద్యులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడుపులో గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Next Story