కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు ఆనంద‌య్య మందు సిద్దం

Ayurvedic Medicine Ready for Omicron Variant says Krishnapatnam Anandayya.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Dec 2021 9:13 AM IST
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు ఆనంద‌య్య మందు సిద్దం

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. రెండు డోసుల టీకా తీసుకున్న‌వారిని ఈ మ‌హ‌మ్మారి వ‌ద‌ల‌డం లేదు. డెల్టా వేరియంట్ కంటే దాదాపు మూడు రెట్ల వేగంతో వ్యాప్తిచెందుతోంది. బ్రిట‌న్‌, ద‌క్షిణాఫ్రికా, అమెరికా దేశాల్లో పెద్ద ఎత్తున ఒమిక్రాన్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక మ‌న‌దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే 12 రాష్ట్రాల్లో మొత్తం 215 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఒక్క కేసు న‌మోదు అయిన‌ప్ప‌టికి తెలంగాణలో మాత్రం ఇప్ప‌టికే 24 కేసులు వెలుగుచూశాయి. క్రిస్మ‌స్‌, కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల నేప‌థ్యంలో ఈ మ‌హ‌మ్మారి విజృంభించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన‌ రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. ఇప్పటికే ప‌లు ఆంక్ష‌లు విధించాయి. క‌రోనా జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని సూచిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు తన వద్ద మందు సిద్ధంగా ఉందని నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన‌ ఆనందయ్య చెప్పారు. గ‌తంలో క‌రోనాకు ఇచ్చిన మందుకు కొన్ని మూలిక‌లు జోడించి ఈ మందును త‌యారుచేసిన‌ట్లు తెలిపారు. శీతాకాలంలో ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. తాను త‌యారు చేసిన మందు ఒమిక్రాన్‌పై స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. పేద‌లంద‌రికీ త‌న మందును ఉచితంగా అందిస్తాన‌ని వెల్ల‌డించారు. ఇక తాను తయారు చేసిన మందు వ‌ల్ల ఎలాంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వ‌న్నారు. ఎక్కువ మోతాదులో కావాలంటే ప్ర‌త్యేకంగా త‌యారు చేసిస్తాన‌ని తెలిపారు. కాగా.. ఆయుష్ నుంచి అనుతులు వ‌చ్చాక‌నే త‌న మందును ఆన్‌లైన్‌లో స‌ర‌ఫ‌రా చేయ‌నున్నట్లు పేర్కొన్నారు.

క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆనంద‌య్య క‌నిపెట్టిన ఆయుర్వేద మందుకు దేశ వ్యాప్తంగా ప్ర‌చారం ల‌భించింది. ఎంతో మంది నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి త‌ర‌లివ‌చ్చారు. ఆయ‌న మందును వాడారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ఆయ‌న మందును తీసుకున్నారు.

కాగా.. అప్ప‌ట్లో ఆనందయ్య తయారుచేసిన కరోనా మందుపై అల్లోపతి వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆనంద‌య్య అల్లోపతి వైద్యుల మాటల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

Next Story