టీడీపీ నేత‌ పట్టాభిపై విజ‌య‌వాడ‌లో దాడి జరిగింది. ఇంటి నుండి ఆఫీస్‌కు బ‌య‌లుదేరుతుండ‌గా.. దుండ‌గులు కారు‌ను చుట్టుముట్టి రాడ్‌తో దాడి చేశారు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘ‌ట‌న‌లో పట్టాభికి గాయాలయ్యాయి. ఈ దాడిలో ఆయన సెల్‌ఫోన్ కూడా ధ్వసమైంది.

ఈ విష‌య‌మై ప‌ట్టాభి మాట్లాడుతూ.. ఉద‌యం ఆఫీస్‌కు బయలుదేరే సమయంలో ఇంటికి దగ్గరలోనే దాదాపు 10 మంది కాపుగాసి, ఒక్కసారిగా కారును చుట్టుముట్టి రాడ్లు, కర్రలు, బండరాళ్లతో దాడులు చేశారని తెలిపారు. తనపై దాడి చేశారని, కారును పూర్తిగా ధ్వంసం చేశారని చెప్పారు. డ్రైవర్‌పై కూడా దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా తన వాహనాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని ఈ సందర్భంగా పట్టాభి గుర్తుచేశారు.


సామ్రాట్

Next Story