శ్రీకాకుళంలో బుద్ధుడి విగ్ర‌హాం ధ్వంసం.. నెల‌రోజుల వ్య‌వ‌ధిలో రెండోసారి

Attack On Budha Statue In Srikakulam. ఏపీలో ఆల‌యాలపై దాడులు కొన‌సాగుతున్నాయి. శ్రీకాకుళంలో బుద్ధుడి విగ్ర‌హాం ధ్వంసం.. నెల‌రోజుల వ్య‌వ‌ధిలో రెండోసారి.

By Medi Samrat  Published on  4 Jan 2021 9:44 AM IST
Budha Statue

ఏపీలో ఆల‌యాలపై దాడులు కొన‌సాగుతున్నాయి. ఎవ‌రు ఎందుకు చేస్తున్నారో తెలియ‌డం లేదు. శ్రీకాకుళం జిల్లా టెక్క‌లిలో బుద్ధుని విగ్ర‌హాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే రెండు సార్లు ధ్వంసం చేయ‌డం గ‌మ‌నార్హం. ఎర్ర‌న్నాయుడు స‌మ‌గ్ర ర‌క్షిత మంచినీటి ప‌థ‌కం ప‌క్క‌నున్న ఉద్యాన‌వ‌నంలో ఎన్టీఆర్‌, ఎర్ర‌న్నాయుడు, తెలుగుత‌ల్లి విగ్ర‌హాల‌తో పాటు బుద్దుని విగ్ర‌హాం ఉంది.

నెలరోజుల క్రితం ఈ విగ్ర‌హాం కుడి చేతి బాగాన్ని దుండ‌గులు ధ్వంసం చేయ‌గా.. అధికారులు గుర్తించి శిల్పి సాయంతో కొత్త చేతిని అమ‌ర్చారు. అయితే.. ఆదివారం నాటికి బుద్దుని చేయి బాగాన్ని ఎవ‌రో మ‌ళ్లీ విర‌గొట్టారు. ఆక‌తాయిల ప‌నిగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని పార్కును ప‌ర్య‌వేక్షిస్తున్న గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విభాగం డీఈ రాజు తెలిపారు.


Next Story