Video : ఏడో తరగతి విద్యార్థులను చావబాదిన టెన్త్ స్టూడెంట్
కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ హాస్టల్‌లో దారుణం జరిగింది.
By Knakam Karthik
Video: దారుణం, విద్యార్థులను బెల్టుతో చితకబాదిన పదో తరగతి విద్యార్థి
కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ హాస్టల్‌లో దారుణం జరిగింది. ఏడో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులను పదో తరగతికి చెందిన విద్యార్థి మహేశ్ బెల్టుతో చితకబాదాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాధిత విద్యార్థులు రాజు, ఇషాక్, మహిమానందంగా గుర్తించారు. కాగా పులపర్తికి చెందిన మహేష్ అనే విద్యార్థి వసతి గృహంలో అనిఫిషయల్‌గా ఉంటూ పదో తరగతి చదవుతున్నాడని, సిగరెట్లు తాగుతూ హాస్టల్‌లో మిగతా విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించేవాడిని తోటి విద్యార్థులు ఆరోపించారు.
ఘటన జరిగిన రోజు రాత్రి ముగ్గురు విద్యార్థులు ట్యాబెట్ల కోసం బయటకు రాగా స్థానికులు అనుమానంతో కేకలు వేశారని, భయంతో హాస్టల్‌లోకి పరుగెత్తుకొచ్చామని బాధిత విద్యార్థులు చెప్పారు. అయితే దీనిని ఆసరా చేసుకున్న మహేష్..విద్యార్థులపై దారుణంగా దాడి చేశాడు. దొంగతనానికి వెళ్లారనే నెపంతో బెల్టుతో చితకబాదాడు. కాగా జరిగిన ఘటనపై హాస్టల్ వార్డెన్ రాముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.