ఏపీలో దారుణం.. సైనికుడిపై పోలీసుల దాడి.. కాలితో తన్ని..
ఓ సైనికుడిపై పోలీసులు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
By అంజి Published on 8 Nov 2023 6:45 AM GMTఏపీలో దారుణం.. సైనికుడిపై పోలీసుల దాడి.. కాలితో తన్ని..
ఓ సైనికుడిపై పోలీసులు దాడి చేసిన ఘటన ఏపీలో జరిగింది. ఫోన్‌లో దిశ యాప్ ఇన్‌స్టాల్ చేసే విషయమై జరిగిన ఈ గొడవ అనకాపల్లి జిల్ఆ పరవాడ మండలం సంతబయలులో చోటుచేసుకుంది. సైనికుడు సయ్యద్ అలీముల్లాతో తన ఫోన్‌లో దిశ యాప్ ఇన్‌స్టాల్ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనేకు ఫోన్ వచ్చిన ఓటీపీని కానిస్టేబుల్ రాసుకోవడం పట్ల అలీముల్లా అనుమానం వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో సైబర్ మోసాల పెరుగుతున్నాయి. ఈ నేపథ్‌యంలోనే మీరు పోలీసులేనా అంటూ అలీముల్లా ప్రశ్నంచాడు. ఇదే అలీముల్లా చేసిన తప్పయ్యింది. తమనే ఐడెంటిటీ కార్డు చూపించమంటావా? అంటూ పోలీసులు అలీముల్లాను కాలర్ పట్టుకొని లాగారు. దీంతో అతడు కిందపడ్డాడు. ఆ వెంటనే ఓ కానిస్టేబుల్ బూటు కాలితో అతడిని తన్నాడు. మహిళా కానిస్టేబుల్ అలీముల్లా చెంపపై కొట్టింది.
పోలీస్ స్టేషన్‌కు వస్తే అన్నీ చూపిస్తామంటూ బెదిరింపులకు దిగారు. అలీముల్లాను పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అతడు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బాధితుడు ఈ విషయాన్ని అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణకి ఫిర్యాదు చేశాడు. మంగళవారం పరవాడ సంతబయలు వద్ద బస్సు కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అప్పటికే అక్కడున్న వారి ఫోన్లలో కానిస్టేబుళ్లు ఎం.ముత్యాలనాయుడు, శోభారాణి ‘దిశ యాప్’ ఇన్‌స్టాల్ చేయిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఎస్పీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్‌కు ఎటాచ్ చేశారు. బాధిత సైనికుడు అలీముల్లా అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలేనికి చెందినవాడు. జమ్మూకశ్మీర్ బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైఫిల్ క్యాంపులో సైనికుడు.