తుపాను బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు

Atchennaidu demands to extend immediate assistance to Mandous Cyclone victims. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. రైతుల సంక్షేమాన్ని పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేస్తున్నారని,

By అంజి  Published on  11 Dec 2022 9:32 AM GMT
తుపాను బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. రైతుల సంక్షేమాన్ని పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేస్తున్నారని, రైతులను ఆదుకోవాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మాండౌస్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైతులు చాలా నష్టపోయారని, తుపాను బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి నష్టపోయిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంటలను లెక్కించాలని డిమాండ్‌ చేశారు. అన్నమయ డ్యాం బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇళ్లు కొట్టుకుపోయి వీధిన పడ్డ కుటుంబాలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Next Story