గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా శనివారం ప్రమాణస్వీకారం చేశారు

By Knakam Karthik
Published on : 26 July 2025 2:10 PM IST

Andrapradesh, Ashok Gajapathi Raju, Goa Governor

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా శనివారం ప్రమాణస్వీకారం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రి వర్గ సభ్యుల సమక్షంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌ బంగ్లా దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, పలువురు ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేశ్‌, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

Next Story