టెన్త్‌ విద్యార్థులకు గుడ్​న్యూస్‌.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది

By అంజి  Published on  16 March 2025 6:39 AM IST
APSRTC,  tenth grade students, APnews

టెన్త్‌ విద్యార్థులకు గుడ్​న్యూస్‌.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

అమరావతి: రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ​ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

ఇంగ్లీష్‌ మీడియం, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో వచ్చే నెల వరకూ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్‌ నిర్వహించనున్నారు. 3 వేల 450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్‌ టికెట్‌ ఆధారంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డీనరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. +ఈ ఏడాది పరీక్షలకు 6,49,275 మంది హాజరుకానున్నారు.

10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌

మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్

మార్చి 19న సెకండ్​ లాంగ్వేజ్

మార్చి 21న ఇంగ్లిష్

మార్చి 22న ఫస్ట్ లాంగ్వేజ్​ పేపర్-2

మార్చి 24న మ్యాథమెటిక్స్

మార్చి 26న ఫిజికల్ సైన్స్

మార్చి 28న బయోలాజికల్ సైన్స్

మార్చి 29న OSSC మెయిన్ లాంగ్వేజ్​ పేపర్ 2, ఒకేషన్ కోర్స్ (థియరీ)

మార్చి 31న సోషల్ స్టడీస్

Next Story