ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. నేడు (శుక్రవారం నాడు) పార్వతీపురంమన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే నేడు 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం అంచనా వేశారు. శ్రీకాకుళం జిల్లా 9, విజయనగరం 13, పార్వతీపురంమన్యం 11, అల్లూరిసీతారామరాజు 9, అనకాపల్లి1, కాకినాడ 4, తూర్పుగోదావరి 8, పశ్చిమగోదావరి 1, ఏలూరు 8, కృష్ణా 7, గుంటూరు 8, బాపట్ల జిల్లాలోని 5 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.
గురువారం అనకాపల్లి జిల్లా నాతవరంలో39.9°C, తూర్పుగోదావరి జిల్లా గోకవరం,కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో39.9°C, చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 39.7°C,నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో39.5°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.7మండలాల్లో తీవ్ర,68 మండలాల్లో వడగాల్పులు వీచాయని అన్నారు.
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (84) వివరాలు