మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. ఏపీలో మరో 10 లిక్కర్‌ బ్రాండ్లకు అనుమతి

APSBCL Gave Permission to another 10 Liquor brands. మందుబాబులకు ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. మద్యం షాపుల్లోకి కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు

By అంజి  Published on  16 Nov 2022 5:32 AM GMT
మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. ఏపీలో మరో 10 లిక్కర్‌ బ్రాండ్లకు అనుమతి

మందుబాబులకు ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. మద్యం షాపుల్లోకి కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. మద్యం షాపుల్లో మరో 10 కొత్త మద్యం బ్రాండ్ల సేల్‌కు అనుమతి ఇచ్చింది. 10 మద్యం బ్రాండ్లకు అనుమతి ఇస్తూ ఏపీఎస్‌బీసీఎల్‌ అనుమతులు మంజూరు చేసింది. వీటి కేటగిరిలో ఉన్న మిగతా బ్రాండ్ల కంటే.. వీటిని ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు కూడా పర్మిషన్‌ ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని కేటగిరీల బీరు ధర రూ. 200గా ఉండగా.. ఇప్పుడు కొత్తగా పర్మిషన్‌ తీసుకున్న బ్రాండ్ల బీరు ధర రూ. 220గా ఉంది.

దీంతో పాటు కొన్ని కేటగిరీల్లో క్వార్టర్ మద్యం ధర రూ.110గా ఉండగా.. ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల మద్యం క్వార్టర్ ధర రూ. 130గా ఉంది. ఈ బ్రాండ్లు తమిళనాడుకు చెందిన ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ సంస్థతో పాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు చెందినవి. అయితే కొత్తగా అనుమతులు పొందిన బ్రాండ్లు, వాటికి నిర్ణయించిన ధరల విషయంలో ఏపీఎస్‌బీసీఎల్‌ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. దీనికి సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. ఇప్పుడు ఇచ్చిన హామీని మరిచి కొత్త కొత్త మద్యం బ్రాండ్లకు పర్మిషన్లు ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. వివిధ రకాల మద్యం బ్రాండ్లను ప్రవేశ పెట్టి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్నారు. దీంతో వైసీపీ సర్కార్‌పై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

Next Story