అమరావతి: పలు పోటీ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ డిగ్రీ, టీటీడీ/ టీటీడీ ఓరియంటల్, టీటీడీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల భర్తీకి సంబంధించి జూన్ 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. రోజూ రెండు షిప్టుల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. జూన్ 20 నుంచి 22 వరకు పరీక్షలు జరగవని పేర్కొంది.
పరీక్షల పూర్తి షెడ్యూల్ కింద పీడీఎఫ్‌లో ఉంది గమనించగలరు.