నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. గ్రూప్-2 నోటిఫికేష‌న్‌ రిలీజ్‌

ఆంధ్ర‌ప్ర‌దే నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌. గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు సీఎం జ‌గ‌న్ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త చెప్పారు.

By అంజి  Published on  8 Dec 2023 12:51 AM GMT
Appsc, Group 2 Notification, APnews

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. గ్రూప్-2 నోటిఫికేష‌న్‌ రిలీజ్‌

ఆంధ్ర‌ప్ర‌దే నిరుద్యోగుల‌కు వైసీపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ వినిపించింది. గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు సీఎం జ‌గ‌న్ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త చెప్పారు. 897 పోస్టుల‌తో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ గ్రూప్-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 897 పోస్టులు విడుదల చేయగా.. అందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి డిసెంబ‌ర్ 21 నుంచి జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వ‌హించ‌నున్నారు.

గ్రూప్-2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌తో ఉద్యోగ ఆశావాహులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కొత్త సిలబస్‌, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్‌ - 2 నోటిఫికేషన్‌ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసినా ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ఆశావాహి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్‌ పరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత మెయిన్‌ పరీక్ష తేదీలను ప్రకటిస్తారు. మెయిన్‌ రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్‌ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్‌ మోడ్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతాయి.

పోస్టుల ఖాళీల వివరాలు, పరీక్ష విధానం తదితర కీలక అంశాలు ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.





Next Story