గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్. అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచన చేసింది. ఈ నెల 10 లోగా పోస్టు, జోనల్/ జిల్లా ప్రాధాన్యాలను నమోదు చేసుకోవాలని సూచించింది. వీటి సబ్మిట్‌కు నేటి నుంచి వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించినట్టు తెలిపింది. గత నెల ఎండింగ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరిగింది. ఈ క్రమంలోనే హారిజాంటల్ రిజర్వేషన్ అమలుపై ఏపీపీఎస్సీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ కేటగిరి కింద మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులను గ్రూప్- 2 పోస్టుల్లో నియమిస్తారు. ఒకవేళ ఈ కేటగిరి కింద అర్హులైన అభ్యర్థులు లేకుంటే.. రూల్స్ ప్రకారం మాత్రమే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
ఈ విషయంలో కొందరు అభ్యర్థులు ఇటీవల ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. హారిజాంటల్ రిజర్వేషన్ కింద అర్హులైన మహిళా అభ్యర్థులు లేకుంటే.. ప్రతిభ కలిగిన మహిళా అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేస్తామని, ఒక వేళ వారు కూడా లేకుంటే అర్హత కలిగిన పురుషులతో భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఇందుకు తగ్గట్టు చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ/ ఎస్టీ / బీసీ/ ఈడబ్ల్యూఎస్/ జనరల్ వివరాలతో ఆప్షన్స్ ఇచ్చేందుకు వెబ్‌సైట్‌లో ఛాన్స్ కల్పించామని, జనరల్ కేటగిరి పోస్టుల ఖాళీల భర్తీకి అభ్యర్థులందరూ ఆప్షన్స్ ఇవ్వొచ్చని తెలిపారు.