Andhrapradesh: నేటి నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
By - అంజి |
Andhrapradesh: నేటి నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ
అమరావతి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుందని టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్ -1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్ - 2 పరీక్ష జరగనుంది. జనవరి 19న ఫలితాలు వెలువడనున్నాయి. పూర్తి వివరాలకు tet2dsc.apcfss.in ను విజిట్ చేయండి.
ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం.. టెట్ నిర్వహించేలా ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లందరికీ టెట్ తప్పనిసరి చేసింది. టెట్ 2ఏ, 2బీ (బీఈడీ) పేపర్లలో ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలకు అర్హత మార్కుల్లో మినహాయింపు ఈ సారి లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఇన్ సర్వీసు టీచర్లు కూడా టెట్ పాసవ్వాలి. అయితే వారికి నిర్దేశిత అర్హతల నుంచి మినహాయింపు ఇచ్చారు.
అటు టెట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ సమీక్ష కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు ఏపీటీఎఫ్ తెలిపింది. 2017లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం ఆర్టీఈ-2010కి పూర్వం ఉన్న టీచర్లు కూడా టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అప్పటి టీచర్లకు టెట్‌ను వర్తింపజేయడం వల్ల కొంత ఇబ్బంది అవుతోంది. 2010కి ముందున్న టీచర్లను దీని నుంచి మినహాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి అని విన్నవించింది.