అమరావతి: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. టెన్త్‌లో సబ్జెక్టుకు రూ.5 తో పాటు ఎగ్జామ్ ఫీజు రూ.95, ఇంటర్‌లో సబ్జెక్టుకు రూ.5తో పాటు పరీక్ష ఫీజు రూ.150 చొప్పున చెల్లించాలని తెలిపారు. సబ్జెక్టుకు రూ.25 జరిమానాతో జనవరి 4 వరకు, రూ.50 అపరాధ రుసుముతో జనవరి 8వ తేదీ వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. విద్యార్థులు తమ దగ్గర్లోని ఏపీఆన్‌లైన్ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా https://apopenschool.ap.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు కింద పీడీఎఫ్‌లో ఉన్నాయి. గమనించగలరు.