'సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్'.. కూటమి ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌గా అట్టర్‌ ప్లాఫ్‌ అయ్యిందన్నారు ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని సెటైర్‌ వేశారు.

By -  అంజి
Published on : 10 Sept 2025 1:30 PM IST

APCC, YS Sharmila, coalition government, APnews

'సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్'.. కూటమి ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు

అమరావతి: సూపర్‌ సిక్స్‌.. సూపర్‌గా అట్టర్‌ ప్లాఫ్‌ అయ్యిందన్నారు ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని సెటైర్‌ వేశారు. హామీలు అమలు చేశామని అప్పుడే సక్సెస్ సభలు జరపడం హాస్యాస్పదమని విమర్శించారు.

''సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా? రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఉంటే ఒక్కరికైనా 3 వేల నిరుద్యోగ భృతి ఇచ్చారా ? 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ? స్థాపించని పరిశ్రమలతో అగ్రిమెంట్లు చేసుకున్నంత మాత్రానా ఉద్యోగాలు ఇచ్చినట్లా ? ఒక్కరికి భృతి ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం రాకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యింది ? 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 15 వందలు ఆర్థిక సహాయం అనేది సూపర్ సిక్స్ హామీ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో ఒక్క మహిళకైనా 15 వందలు ఇచ్చారా ? ఇదేనా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ?'' అంటూ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల నిలదీశారు.

అన్నదాత సుఖీభవ కింద సొంతగా 20 వేలు ఇస్తామని మాట మార్చారని, కేంద్రం ఇచ్చే 6 వేలతో లింక్ పెట్టారని దుయ్యబట్టారు. కేవలం 44 లక్షల మంది రైతులకు ఒక విడత 7 వేలు ఇచ్చి.. 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పంగనామాలు పెట్టారని షర్మిల ఫైర్‌ అయ్యారు. హామీల్లో సగానికి సగం కోత పెట్టడాన్ని సూపర్ హిట్ అంటారా? అని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం కింద 87 లక్షల మంది బిడ్డలు ఉంటే.. కేవలం 67 లక్షల మందికి 13 వేలు ఇచ్చి, 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారని, మూడు సిలిండర్లు ఎంత మందికి ఇస్తున్నారో తెలియదని షర్మిల ఎద్దేవా చేశారు.

వైఎస్‌ షర్మిల మాటల్లో..

''14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుతున్నారు చంద్రబాబు. గోరంత చేసి కొండంత చెప్పుకోవడం నిజంగా కూటమి ప్రభుత్వానికే చెల్లుతుంది. సూపర్ సిక్స్ హామీల సంగతి దేవుడెరుగు. ఇచ్చిన మిగతా హామీలు సైతం మోసమే. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ , బీసీలు,ఎస్సీ ఎస్టీ,మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్, సబ్సిడి కింద వ్యవసాయానికి సాయం, ధరల స్థిరీకరణ నిధి, ఇల్లు లేని పేదలకు 2 నుంచి 3 సెంట్లు భూమి, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఫీజు రీయింబర్స్,ఆరోగ్య శ్రీ బకాయిల చెల్లింపు, విద్యుత్ ఛార్జీల నియంత్రణ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, జర్నలిస్టులకు ఉచిత నివాస స్థలం, ఇలాంటి మానిఫెస్టో ప్రధాన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా?.. దీనికి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి.

Next Story