టాలీవుడ్ హీరోయిన్లను అవమానపరిచే విధంగా మార్ఫింగ్ చేసిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు 30 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ పి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్నెట్ నుండి ఓ హీరోయిన్ చిత్రాలను డౌన్‌లోడ్ చేసాడు. "అతను ఆ ఫొటోలను తారుమారు చేసి, అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు" అని తెలిపారు. ఏపీలోని కోనసీమ జిల్లా రాయవరం మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన పందిరి రామవెంకట వీరాజు హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
ఫేక్ ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేసుకున్న వీర్రాజు అందులో టీవీ యాంకర్లు, సినిమా హీరోయిన్లకు చెందిన ఫొటోలను అప్‌లోడ్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. దీనిపై ఈ నెల 17న యాంకర్ అనసూయ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ ప్రారంభించి, వీర్రాజుపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో నిందితుడు ఫిర్యాదుదారుపై అభ్యంతరకరమైన విషయాలను అప్‌లోడ్ చేశారు. నిందితుడిని అధికారులు పట్టుకోగా, అతను తన ట్విట్టర్ ఖాతాలో అసభ్యకరమైన విషయాలను పోస్ట్ చేసినట్లు వారు గుర్తించారు.