ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు..సేఫ్టీ రూల్స్‌పై రవాణా శాఖ అవగాహన

ఏపీ రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సు ప్రయాణికులకు భద్రతా ప్రమాణాలపై ముమ్మరంగా అవగాహన కల్పిస్తున్నారు

By -  Knakam Karthik
Published on : 6 April 2026 2:47 PM IST

Andrapradesh, AP Transport, BusSafety, RoadSafety, PassengerAwareness

ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు..సేఫ్టీ రూల్స్‌పై రవాణా శాఖ అవగాహన

ఏపీ రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సు ప్రయాణికులకు భద్రతా ప్రమాణాలపై ముమ్మరంగా అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు లేదా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా అత్యవసర ద్వారాలు (Emergency Exits), గ్లాస్ బ్రేకర్లు, అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రత్యక్షంగా వివరిస్తున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో నిబంధనల ప్రకారం భద్రతా సౌకర్యాలు ఉన్నాయా లేదా అని తనిఖీలు చేస్తూనే, అత్యవసర సమయాల్లో ప్రయాణికులు భయాందోళన చెందకుండా సురక్షితంగా బయటపడే మార్గాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారు బస్సు ఎక్కిన వెంటనే ఎగ్జిట్ పాయింట్లపై అవగాహన కలిగి ఉండాలని, అజాగ్రత్తగా ఉన్న బస్సులపై ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story