ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్లలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్ టికెట్‌లో తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని అధికారులకు చూపించి సరి చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 4.27 లక్షల మంది హాజరు కానున్నారు.
టెట్ పరీక్షలు రెండు సెషన్లలో 18 రోజుల పాటు జరుగనున్నాయి. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు జరిగిన తర్వాత అక్టోబర్ 4 నుంచి వరుసగా ప్రైమరీ 'కీ' లు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 5 నుంచి ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 27న టెట్ ఫైనల్ కీ విడుదల చేస్తారు. నవంబర్ 2న ఏపీ టెట్ - 2024 ఫలితాలను ప్రకటిస్తారు. ఇంకా ఎవరైనా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోని వారు ఉంటే https://aptet.apcfss.in/# వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి.