ఏపీలో ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదుకు మరో ఛాన్స్
AP Teacher MLC Voter registration deadline 9th december. వచ్చే సంవత్సరం నిర్వహించనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా
By అంజి Published on 29 Nov 2022 8:38 AM GMTవచ్చే సంవత్సరం నిర్వహించనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 23న ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో (కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాలు) పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఓటరు నమోదు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం జాబితాను రద్దు చేస్తుంది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గతంలో దరఖాస్తు చేసుకోని అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం.. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారితో ఈ నెల 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు.
అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఈ జాబితాను చెక్ చేసుకోవచ్చు. ఒక వేళ పేరు కనుగొనబడకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. కొత్త ఓటరు నమోదు కోసం అభ్యంతరాలతో పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులను ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కాకుండా కలెక్టరేట్‌లోని సహాయ ఎన్నికల అధికారికి అందజేయాలి. దీనిపై ఏవైనా సందేహాలు ఉంటే 1950 నెంబర్‌కు కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
డిసెంబర్ 25వ తేదీ వరకు పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం జరుగుతుంది. డిసెంబర్ 30వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణ వెలువడుతుంది. 2019, అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు అర్హులు.