Andhrapradesh: సీఎంకు సమస్యలు చెప్పుకోవడానికి టోల్‌ ఫ్రీ నెంబర్‌: 7306299999

సామాజిక సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

By అంజి  Published on  30 Jun 2024 4:21 PM IST
Andhrapradesh: సీఎంకు సమస్యలు చెప్పుకోవడానికి టోల్‌ ఫ్రీ నెంబర్‌: 7306299999

అమరావతి: సామాజిక సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. హామీ ఇచ్చిన విధంగా, పేదలకు రేపటి నుంచి పెన్షన్ పెంచి, రూ.4 వేల పింఛన్ ఇవ్వబోతున్నామని చెప్పారు. ఎన్నికల ముందు చెప్పినట్టు 3 నెలల పెంపుదల కూడా కలిపి, రేపు రూ.7 వేలు ఇస్తామన్నారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో చంద్రబాబు పెన్షన్లు అందిస్తారని తెలిపారు. రేపు పెనుమాక గ్రామంలో ఉదయం 6 గంటలకు చంద్రబాబు గారు స్వయంగా పెన్షన్లు అందిస్తారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

''ప్రతి శనివారం చంద్రబాబు.. పార్టీ కేంద్ర కార్యాలయంలో వినతులు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫోటోల కోసం వచ్చే వారితో, నిజమైన సమస్యలతో వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఇబ్బంది పడకుండా, మాకు ముందుగా ఫోన్ చేసి తెలియచేస్తే, ప్రయారిటీ ప్రకారం సమస్యలతో వచ్చే వారిని ముఖ్యమంత్రి కలిసేలా చేస్తాం. 7306299999 నంబర్ కి ఫోన్ చేసి ముందుగా మాకు తెలియచేయండి'' అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Next Story