నేడే ఏపీ టెన్త్ రిజల్ట్స్.. ఫలితాల కోసం ఇలా చేయండి

AP SSC Results 2021 today.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నేడు ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. శుక్ర‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2021 2:32 AM GMT
నేడే ఏపీ టెన్త్ రిజల్ట్స్.. ఫలితాల కోసం ఇలా చేయండి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నేడు ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. శుక్ర‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. విద్యార్థుల‌కు గ్రేడ్లు ఎలా ఇవ్వాల‌న్న దానిపైన ప్ర‌భుత్వం హైప‌వ‌ర్ క‌మిటీని ఏర్పాటు చేసింది. క‌మిటీ ఇచ్చిన సిఫార్సుల‌కు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు విద్యార్థుల‌కు గ్రేడ్ల‌ను ప్ర‌క‌టించారు.

2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించిన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ ఫలితాలను 'www.bse.ap.gov.in' వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చున‌ని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల 'మెమొరాండమ్‌ ఆఫ్‌ సబ్జెక్టు వైజ్‌ పెర్‌ఫార్మెన్స్‌'లను తమ పాఠశాల లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. డౌన్‌లోడ్‌ చేసిన కాపీలను అటెస్టెడ్‌ సంతకాలు చేసి విద్యార్థులకు ఇవ్వాలని పేర్కొన్నారు.

తెలుసుకోండి ఇలా..

- 2020 విద్యార్థులు : సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఆల్‌పాస్‌గా ప్రకటించి గతంలో ధ్రువపత్రాలు ఇచ్చారు. వాటిలో వారి హాల్‌టికెట్ల నంబర్లను పొందుపరిచారు. ఆ హాల్‌టికెట్‌ నంబర్‌ ఆధారంగా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా తమ గ్రేడ్లు తెలుసుకోవచ్చు.

- 2021 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఫలితాల పోర్టల్‌లో తమ జిల్లా, మండలం, పాఠశాల, తమ పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు తెలుసుకోవచ్చు.


Next Story