అల‌ర్ట్‌.. ఏపీ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

411 ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వ‌హించిన ప్రిలిమిన‌రీ రాత ప‌రీక్ష‌కు సంబంధించిన ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2023 5:35 AM GMT
అల‌ర్ట్‌.. ఏపీ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 411 ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వ‌హించిన ప్రిలిమిన‌రీ రాత ప‌రీక్ష‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను నేడు(మంగ‌ళ‌వారం) ఏపీ పోలీసు నియామ‌క మండ‌లి విడుద‌ల చేసింది. ఈ నెల 19న ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు పేప‌ర్‌-1, మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు పేప‌ర్‌-2 ప‌రీక్షను నిర్వ‌హించారు.

మొత్తం 1,51,288 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌కు హాజ‌రు కాగా.. 57,923 మంది అర్హ‌త సాధించారు. అర్హ‌త సాధించిన వారిలో 49,386 మంది పురుషులు ఉండ‌గా 8,537 మంది మ‌హిళ‌లు ఉన్నారు. slprb.ap.gov.in వైబ్‌సైట్ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అభ్య‌ర్థులు ఫ‌లితాల‌ను తెలుసుకోవ‌చ్చు. మార్చి 4 ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు ఈ ఫ‌లితాల‌కు సంబంధించిన ఓఎంఆర్ షీట్ల‌ను డౌన్ లోడ్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించారు.Next Story