ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 27,861 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా.. 81 పాజిటివ్ కేసులుగా నిర్థార‌ణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,86,066కి చేరింది. కొవిడ్ వ‌ల్ల విశాఖ‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్ల‌డించారు. దీంతో రాష్ట్రంలో క‌రోనాతో మృత్యువాత ప‌డిన వారి సంఖ్య 7,141కి చేరింది. నిన్న ఒక రోజే 263 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,713 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 1,26,04,214 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు న‌మోదు అయ్యాయంటే..

అనంతపురం 0, చిత్తూరు 15, ఈస్ట్ గోదావరి 03, గుంటూరు 13, కడప 19, కృష్ణా 06, కర్నూలు 04, నెల్లూరు 01, ప్రకాశం 06, శ్రీకాకుళం 04, విశాఖపట్టణం 07, విజయనగరం 01, వెస్ట్ గోదావరి 02

తోట‌ వంశీ కుమార్‌

Next Story