ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అంతకు ముందు పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. అయితే న్యాయవాది శివప్రసాద్‌ రెడ్డి కోర్టులో ఈ పిటిషన్‌ను సోమవారం దాఖలు చేశారు. 2019 ఓటరు జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే యువత ఓటు హక్కు కోల్పోతుందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో ఎన్నికలపై రాష్ట్ర సర్కార్‌, ఎస్‌ఈసీ సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో న్యాయవాది వేసిన లంచ్‌ మోషన్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. మంగళవారం విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. బుధవారం మరోసారి వాయిదా వేసింది. ఎల్లుండి విచారణ జరుపుతామని స్పష్టం చేయగా, ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. దీంతో పిటిషన్‌పై గురువారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.


కాగా, ఈ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిలిపివేయాలని ఏపీ సర్కార్‌ కోర్టుకు విన్నవించినా.. ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమైంది. దాంతో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు మళ్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు కావడంతో గురువారానికి వాయిదా పడింది.
సామ్రాట్

Next Story