ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

AP MLC Election Shedule Released.ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం షెడ్యూల్ విడుద‌ల‌.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 18 Feb 2021 2:55 PM IST

AP MLC Election Schedule Released

ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఫిబ్ర‌వ‌రి 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిషికేష‌న్ విడుద‌ల కానుండ‌గా.. మార్చి 15న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 4 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువును ప్రకటించారు. మార్చి 5న నామినేషన్ల పరిశీలన జ‌ర‌గ‌నుండ‌గా.. మార్చి 8 వరకు ఉపసంహరణ గడువు విధించారు. మార్చి 15న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంత‌రం అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో మార్చి 29తో నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. తిప్పేస్వామి, సంధ్యారాణి, వీరవెంకటచౌదరి, షేక్‌ అహ్మద్‌ ఇక్బాల్ ప‌ద‌వీకాలం మార్చి 29తో ముగియ‌నుండ‌గా.. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

- ఈనెల 25న నోటిఫికేషన్ విడుద‌ల‌

-నామినేషన్ల స్వీకరణకు మార్చి 4 తుదిగడువు

-మార్చి 5న నామినేషన్ల పరిశీలన

-మార్చి 8న నామినేషన్ల ఉపసంహరణ

-మార్చి 15న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌

-అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్‌




Next Story