పోలీసులపై మంత్రి పేర్ని ఆగ్రహం.. తమాషాలు చేస్తున్నారా అంటూ..

AP Minister Perni nani fire on police. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పోలవరంలో పర్యటించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రుల

By అంజి  Published on  5 March 2022 10:20 AM IST
పోలీసులపై మంత్రి పేర్ని ఆగ్రహం.. తమాషాలు చేస్తున్నారా అంటూ..

నిన్న కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పోలవరంలో పర్యటించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రుల వాహనాలను పోలీసులు ఆపడంతో వివాదం చోటు చేసుకుంది. పోలవరం ప్రాజెక్టు దగ్గర పోలీసులపై మంత్రి పేర్ని నాని ఫైర్‌ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఉన్న పేర్ని నాని కూడా ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి వెళ్లారు. అయితే పోలీసులు పార్కింగ్‌ చేసిన ఉన్న కారును అక్కడి నుండి తీయాలని చెప్పడంతో మంత్రి పేర్ని నాని ఆగ్రహించారు.

కారు తీయమన్నది ఎవరంటూ మంత్రి పేర్ని కస్సు బుస్సులాడారు. '' నా డిసిగ్నేషన్‌ ఎంటో తెలుసా.. నేను ఎవరో తెలుసా'' అంటూ పోలీసులకు క్లాస్‌ పీకారు. ఎస్పీ, డీఐజీ కార్లు పార్క్‌ చేసి ఉండటాన్ని చూసి మండిపడ్డారు. తమాషాలు చేస్తున్నారా.. నేను ఇంచార్జ్‌ మంత్రినంటూ కోపంతో ఊగిపోయారు. ఇక్కడితో పండుగ అయిపోలేదంటూ మంత్రి పేర్ని నాని వార్నింగ్‌ ఇచ్చారు.


Next Story