మంగళగిరి వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి లోకేశ్..అక్కడ ఫ్రీ ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి వాసులకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ గుడ్ న్యూస్ చెప్పారు.

By Knakam Karthik
Published on : 11 March 2025 3:13 PM IST

Andrapradesh, Ap Minister Nara Lokesh,  Mangalagiri Walkers

మంగళగిరి వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి లోకేశ్..అక్కడ ఫ్రీ ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి వాసులకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ గుడ్ న్యూస్ చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి వాసులకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ గుడ్ న్యూస్ చెప్పారు. మంగళగిరి ఎకో పార్కులో ఉదయం నడకకు వచ్చే వాకర్లకు ఇక ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఎన్నికల సమయంలో వాకర్స్ మిత్రులకు ఇచ్చిన హామీ మేరకు, ఎకో పార్కులో ప్రవేశ రుసుం ఎత్తివేస్తున్నట్టు నారా లోకేశ్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదిగా తెలియజేశారు.

"ఎకో పార్కులో ప్రవేశ రుసుము తొలగించాల్సిందిగా వాకర్స్ మిత్రులు ఎన్నికల సమయంలో నన్ను కోరగా, మాట ఇచ్చాను. ఈ విషయమై ఇటీవల అటవీ అధికారులతో మాట్లాడాను. అయితే ఫారెస్టు శాఖ పార్కుల్లో రుసుం వసూలు కేవలం నిర్వహణ కోసమేనని, రాష్ట్ర వ్యాప్త పాలసీలో భాగమైనందున తొలగించడం వీలుకాదని చెప్పారు.

అయితే, వాకర్స్ మిత్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి మంగళగిరి ఎకో పార్కులో మార్నింగ్ వాకర్స్ ద్వారా ఏటా లభించే రూ.5 లక్షల రూపాయలను నా వ్యక్తిగత నిధుల నుంచి చెల్లించాను. ఇకపై మంగళగిరి ప్రాంత వాసులు ఎటువంటి రుసుం లేకుండా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఎకో పార్కులో నడక సాగించవచ్చు" అని తెలిపారు.

Next Story