కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన : మంత్రి అమర్‌నాథ్
AP minister Gudiwada Amarnath criticized the Janasena party. ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో
By అంజి
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నేరుగా కులాల పేర్లను పెట్టి వివాదాస్పదంగా మాట్లాడారు. కొన్ని కులాల పేర్లను పవన్ కల్యాణ్ పార్టీకి అంటించారు. పవన్ కల్యాణ్ నడుపుతున్నది కాపు జనసేన పార్టీ కాదని.. కమ్మ జనసేన పార్టీ అని వ్యాఖ్యానించారు. ఏపీలో పవన్ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తుండటంతో కాపులు ఆయనకు ఓట్లు వేయడం లేదన్నారు. నాదెండ్ల డైరెక్షన్‌లో పవన్ నడిపేది కమ్మ జనసేన అని, కాపులు పవన్‌ను ఓన్ చేసుకునే పరిస్థితి లేదని మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతలు కొందరు దురుద్ధేశంతో సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని లాగుతున్నారని అమర్‌నాథ్ మండిపడ్డారు. మరోసారి భారతి గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. టీడీపీ నాయకుడు నారా లోకేశ్‌కు బ్రాహ్మణితో ఏదైనా ఉంటే ఇంట్లో తేల్చుకోవాలని హితవు పలికారు. రాజకీయాల్లో ఉన్న వారిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమని, అయితే ఏనాడు రాజకీయాల్లోకి రాని భారతి గురించి విమర్షలు చేయడం మానుకోవాలని మంత్రి అమర్‌నాథ్ సూచించారు.
ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్.. తమది ఆ కుల పార్టీ, ఈ కుల పార్టీ అని ఎప్పుడూ చెప్పలేదు. కుల, మత రహిత పాలిటిక్స్ కోసమే వచ్చానని చెబుతూ ఉంటారు. ఓ కులాన్ని నమ్ముకుంటే రాజకీయంగా లాభపడి ఉండేవాడినని, అయితే అలాంటివి తనకు ఇష్టముండదని చెబుతూ ఉంటారు. అయితే వైసీపీ నేతలు మాత్రం.. పవన్‌ను ఓ సామాజికవర్గ నేతగా చూపించి విమర్శలు చేయాలన్న విధానం పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శించిన.. తర్వాత పవన్ సామాజికవర్గం కేంద్రంగానే వైసీపీ నేతలు విమర్శలు చేయడం కనిపిస్తోంది.