ప్రారంభమైన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమయాత్ర
AP Minister Goutham Reddy's funeral at Udayagiri.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమయాత్ర
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2022 8:45 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలోని మంత్రి నివాసం నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో మంత్రి పార్థివదేహాన్ని ఉదయగిరికి తరలిస్తున్నారు. ఆయన భౌతిక కాయం వెంటన భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. అంతిమయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు(బుధవారం) ఉదయం 11.00గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు సీఎం జగన్ హాజరు కానున్నారు.
సోమవారం ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రాగా.. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని వైద్యులు తెలిపారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ఇక లేరన వార్త విని ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలుగురాష్ట్ర ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుమారుడు కృష్ణార్జున్ రెడ్డి అమెరికా నుంచి రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. తండ్రి భౌతికకాయాన్ని చూసి బోరున విలపించారు.
మేకపాటి గౌతంరెడ్డి 1971లో జన్మించారు. నెల్లూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. 2014, 2019లో రెండు సార్లు ఆత్మకూరు నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిగా పనిచేస్తున్నారు.