ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు మాతృ వియోగం జరిగింది. అతడి తల్లి థెరీసమ్మ కన్నుమూశారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె ఉపాధ్యాయురాలు, డాక్టర్ ఆదిమూలపు శామ్యూల్ జార్జ్ విద్యాసంస్థల చైర్‌పర్సన్ కూడా. ఆమె భౌతికకాయాన్ని ఈ రోజు మార్కపురం తీసుకెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మార్కాపురంలోని జార్జి గ్రీన్స్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
టీచర్‌గా పని చేసిన థెరీసమ్మ.. ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. థెరీసమ్మకు ఐదుగురు సంతానం.. వారిలో ఇద్దరు కుమారులైన ఆదిమూలపు సురేష్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. రెండో కుమారుడు డాక్టర్ సతీష్ జార్జి విద్యాసంస్థల కార్యదర్శిగా ఉన్నారు. థెరీసమ్మ మృతితో ఆదిమూలపు సురేష్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆదిమూలపు సురేష్‌కు.. పలువురు సన్నిహితులు, వైసీపీ నేతలు థెరీసమ్మ మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. విద్యారంగానికి ఆమె చేసిన సేవలను పలువురు గుర్తుచేసుకుంటున్నారు.