పట్టపగలు వికృత చేష్టలు.. అసభ్యకర రీతిలో డ్రైవింగ్.. ప్రేమ జంట అరెస్ట్
AP Love couple hugs on moving bike.. arrested. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పట్టపగలే ఓ యువతీ యువకుడు రెచ్చిపోయారు.
By అంజి
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పట్టపగలే ఓ యువతీ యువకుడు రెచ్చిపోయారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై పట్టపగలు బరితెగించారు. యువకుడు రన్నింగ్ బైక్ ఇంధన ట్యాంక్‌పై యువతి కూర్చొబెట్టుకుని కౌగిలించుకున్నట్లు చూపుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రేమ జంటను అరెస్టు చేసినట్లు గురువారం అధికారి తెలిపారు. ఈ వీడియో విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ రహదారికి చెందినదని, దానిని కారులో కూర్చున్న మరికొందరు చిత్రీకరించారని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతిని కె శైలజ (19), యువకుడిని అజయ్ కుమార్ (22)గా గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని విశాఖపట్నం పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, ఆ జంటను పట్టుకుని అరెస్టు చేశారు.
హెల్మెట్ లేకుండా యువకుడు డ్రైవింగ్ చేశాడు. కాలేజ్ యూనిఫామ్ ధరించి విద్యార్థిని వికృత చేష్టలు చూసి స్థానికులు నివ్వెరపోయారు. ఇరువురిపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి, వాహనాన్ని స్టీల్ ప్లాంట్ పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు 336, 279, 132, 129 మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. పౌరులు, వారి కుటుంబాలు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం చాలా ముఖ్యమని నగర పోలీసు కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
విశాఖలో లవర్స్ ఓవర్ యాక్షన్. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై పట్టపగలు బరితెగింపు. హెల్మెట్ లేకుండా యువకుడు డ్రైవింగ్. కాలేజ్ యూనిఫామ్ ధరించి విద్యార్థిని వికృత చేష్టలు చూసి నివ్వెరపోయిన స్థానికులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/i2dGgHKElg
— Vizag News Man (@VizagNewsman) December 29, 2022