ఏపీలో నేటి నుండి రెండో విడత 'పంచాయతీ' నామినేషన్లు

AP Local Body Elections Second Phase Nominations From Today. ఏపీలో నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు.

By Medi Samrat  Published on  2 Feb 2021 3:15 AM GMT
AP Local Body Elections Second Phase Nominations From Today

ఏపీలో నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. 3,335 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు, 33,632 వార్డులకు రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల స్వీకరణ ఈ రోజు మొదలై.. 4వ తేదీ వరకు కొనసాగనుంది. 5న నుంచి నామినేషన్ల‌ పరిశీలన మొదలవుతుంది. 8వ ‌తేదీ మధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు. 13వ తేదీ పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టి, ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాలు వెలువడ్డాక అదేరోజు సాయంత్రం లేదంటే మరుసటి రోజు ఉదయం సర్పంచ్‌, ఉప సర్పంచుల ఎన్నికను నిర్వహించనున్నారు.


Next Story
Share it