ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఎన్నికల సంఘం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు నాలుగు దశలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొంది.
ఈ నెల 23న తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఫిబ్రవరి 5న తొలి దశ, 9న రెండో దశ, 13న మూడో దశ, 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో రాష్ట్రంలో రేపటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని ఎన్నికల సంఘం తెలిపింది.