జైలులో అస్వస్థతకు గురైన ఏపీ లిక్కర్ కేసు రిమాండ్ ఖైదీ

ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు

By -  Knakam Karthik
Published on : 21 Jan 2026 7:07 PM IST

Andrapradesh, AP liquor Case, Vijayawada Government Hospital, Raj Kasireddy

జైలులో అస్వస్థతకు గురైన ఏపీ లిక్కర్ కేసు రిమాండ్ ఖైదీ

ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జైల్లో ఉండగానే ఆయనకు స్వల్ప అనారోగ్యం తలెత్తడంతో అధికారులు వెంటనే ఆయన్ను విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో రాజ్ కసిరెడ్డికి వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ప్రాథమికంగా స్వల్ప అస్వస్థత కారణంగానే ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. లిక్కర్ కేసులో ఏ1 నిందితుడిగా రాజ్ కసిరెడ్డిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా జైలులోనే ఉన్నారు.

Next Story