రానున్న 3 గంటల్లో ఏపీలో పిడుగుల వానలు..ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

By -  Knakam Karthik
Published on : 10 April 2026 3:10 PM IST

AndhraPradesh, Weather Alert, AP Rain, Thunderstorm, Lightning Alert, Apsdma

రానున్న 3 గంటల్లో ఏపీలో పిడుగుల వానలు..ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ఆయన సూచించారు.

Next Story