AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్, ఫీజు.. పూర్తి వివరాలివే
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది.
By అంజి Published on 28 April 2023 12:49 PM ISTAP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్, ఫీజు.. పూర్తి వివరాలివే
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో హాల్ టిక్కెట్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రాక్టికల్ పరీక్షలు మే 5 నుంచి 9 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.
విద్యార్థులు మే 3వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం మే 24న ద్వితీయ భాష (తెలుగు, హిందీ సంస్కృతం) పరీక్ష, 25న ఇంగ్లిష్, మే 26న గణితం, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం, 27న గణితం-బీ, జువాలజీ, హిస్టరీ, 27న ఫిజిక్స్, ఎకనామిక్స్, 29న రసాయన శాస్త్రం, 30న కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, సంగీతం, 31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్సు, బైపీసీ విద్యార్థులకు మ్యాథ్స్, లాజిక్ పేపర్. జూన్ 1న మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ రుసుము వివరాలు:
జనరల్ కోర్సులకు పరీక్ష ఫీజు: రూ. 490
ఒకేషనల్ కోర్సులకు పరీక్ష ఫీజు: రూ. 680
జనరల్ కోసం పరీక్ష రుసుము | వొకేషన్ బ్రిడ్జ్: ఒక్కో కోర్సు సబ్జెక్టుకు రూ.135
రెండవ సంవత్సరం సప్లిమెంటరీ రుసుము వివరాలు:
థియరీ 1వ సంవత్సరం పేపర్లు లేదా 2వ సంవత్సరం పేపర్ల కోసం (పేపర్ల సంఖ్యతో సంబంధం లేకుండా): రూ 490
2వ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ. 680
2వ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థుల వృత్తి విద్యా కోర్సులకు పరీక్ష రుసుము: రూ. 680
2వ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు పరీక్ష రుసుము: రూ. 190