విధుల‌ను బ‌హిష్క‌రించిన ఏపీ హైకోర్టు న్యాయ‌వాదులు

AP High Court Advocates protest on Judges Transfer.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టులో న్యాయ‌వాదులు విధుల‌ను బ‌హిష్క‌రించి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2022 1:14 PM IST
విధుల‌ను బ‌హిష్క‌రించిన ఏపీ హైకోర్టు న్యాయ‌వాదులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టులో న్యాయ‌వాదులు విధుల‌ను బ‌హిష్క‌రించి నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ఏపీ హైకోర్టుకు చెందిన న్యాయ‌మూర్తుల బ‌దిలీల‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. గుజరాత్ హైకోర్టు న్యాయ‌మూర్తి బ‌దిలీని వెన‌క్కి తీసుకుని.. రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం న్యాయ‌మూర్తుల బ‌దిలీ ప్ర‌తిపాద‌న వివ‌క్ష‌కు సంకేతం అని ఆరోపించారు. జస్టిస్‌ బట్టుదేవానంద్‌, జస్టిస్‌ డి.రమేష్ బ‌దిలీ స‌రికాదంటూ న్యాయ‌వాదులు నినాదాలు చేస్తున్నారు.


సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయ‌మూర్తుల‌ను బ‌దిలీ చేస్తూ గురువారం సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌ద్రాస్ హైకోర్టుల నుంచి ఇద్ద‌రు చొప్పున ఉన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు నుంచి జస్టిస్‌ బట్టుదేవానంద్ ను మ‌ద్రాస్ హైకోర్టుకు, జస్టిస్‌ డి.రమేష్ ను అల‌హాబాద్ హైకోర్టుకు,తెలంగాణ హైకోర్టు నుంచి జ‌స్టిస్ ఏ.అభిషేక్‌రెడ్డిని ప‌ట్నా హైకోర్టుకు, జ‌స్టిస్ క‌న్నెగంటి ల‌లిత‌ను క‌ర్ణాట‌క హైకోర్టుకు, జ‌స్టిస్ డాక్ట‌ర్ డి.నాగార్జున‌ను మ‌ద్రాస్ హైకోర్టుకు, మ‌ద్రాస్ హైకోర్టు నుంచి జ‌స్టిస్ వి.ఎం.వేలుమ‌ణిని క‌ల‌క‌త్తా హైకోర్టుకు, జ‌స్టిస్ టీ.రాజాను రాజ‌స్థాన్ హైకోర్టుకు బ‌దిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగ‌తి తెలిసిందే.

Next Story